nandyala

ఏడు దశబ్దాల నుండి ఉర్దూ సేవ చేస్తున్న సిద్ధిఖీ కి ఘనంగా సన్మానం

ఏడు దశబ్దాల నుండి ఉర్దూ సేవ చేస్తున్న సిద్ధిఖీ కి ఘనంగా సన్మానం

నంద్యాల ఖలీల్ సిద్ధికి హై స్కూల్ యందు ప్రముఖ ఉర్దూ కవి సర్ మొహమ్మద్ ఇక్బాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉర్దూ భాష దినోత్సవము కె.ఎమ్ ఫసిహుద్దీన్ సిద్ధికి అధ్యక్షతన ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో జమాన్ ఫౌండేషన్ మిత్రులు మరియు ఖలీల్ సిద్ధికి స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కలిసి ఖలీల్ సిద్ధికి హై స్కూల్ కరస్పాండెంట్ కె.ఎం. ముస్తాక్ మహమ్మద్ సిద్ధిఖీ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు మరియు జమాన్ ఫౌండేషన్ గౌరవ సలహాదారులు అయిన సయ్యద్ సలముల్లా, ప్రముఖ న్యాయవాది మరియు మైనారిటీ నాయకులు నూర్ అహ్మద్ మదని, మరియు నవభారత్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు వైఎస్ఆర్సిపి మైనారిటీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ వారిని శాలువా పూలమాలతో సత్కరించి ఉర్దూ నేమ్ ప్లేట్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖలీల్ సిద్ధికి హై స్కూల్ వ్యవస్థాపకులు అయినటువంటి కీర్తిశేషులు మొయినుద్దీన్ సిద్ధికి 1957 లో స్థాపించి ఇప్పటికీ దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలను ఉర్దూ మీడియం లో నడుపుతూ ఉర్దూ భాషకు ఎనలేని సేవ చేయడం మన అందరికీ ఆదర్శం అన్నారు. తమ తాత మరియు తండ్రి అడుగుజాడల మీద నడుస్తున్న మన ప్రస్తుత కరస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్ సిద్ధికి కూడ ఉర్దూ భాష సేవ కొరకు తన సమయాన్ని కేటాయించడం ద్వారా ఆయనకు మాతృభాష  మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తో పాటు జమాన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ఎం. వి. జమాన్ పాల్గొనడం జరిగింది.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button