
ఎస్టీయూ రాష్ట్ర సంక్షేమ నిధి కమిటీ సభ్యులుగా జి. వి. రమణ ఎన్నిక
ఎస్టీయూ రాష్ట్ర సంక్షేమ నిధి కమిటీ సభ్యులుగా జి. వి. రమణ ఎన్నిక
జి. వి. రమణ ఎన్నిక పట్ల ఎస్టీయూ డోన్ మండల శాఖ హర్షం
డోన్ (ఆంధ్రప్రతిభ)20 సెప్టెంబర్ : రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర సంక్షేమ నిధి కమిటీ సభ్యులుగా డోన్ మండల సీనియర్ ఎస్టీయూ నాయకులు జి.వి రమణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. ఎస్టీయూ సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జి.వి. రమణ రాష్ట్ర సంక్షేమ నిధి కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల ఎస్టీయూ డోన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు షేక్ హుస్సేన్, భాస్కర్, రామ్మోహన్ మరియ్ మీడియా కన్వీనర్ విశ్వనాథ్ హర్షం వ్యక్తం చేశారు. జి. వి. రమణ కి ఎస్టీయూ ఎస్టియు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు అధ్యక్షులు ఈ.షణ్ముర్తి, జిల్లా ఉపాధ్యక్షులు మౌలాలి, సి. శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు నందప్ప, సీనియర్ నాయకులు శివప్రసాద్, పరమేశ్, డా. దేవేంద్రప్ప, జి. మద్దిలేటి రామదాసు, టి.శ్రీనివాసులు, బి.వై. మద్దిలేటి, జానకి రాముడు, రాం ప్రసాద్, నాగన్న, రంగనాథ్, మునీంద్ర తదితర డోన్ మండల నాయకులు తదితరులు రమణ కి తమ శుభాకాంక్షలు తెలిపారు.