nandyala

ఎస్టి పునరుద్ధరణ జరుగ కుండా, మహర్షి జయంతి ఉత్సవాలు మాకెందుకు – వాల్మీకి నేతలు

ఎస్టి పునరుద్ధరణ జరుగ కుండా, మహర్షి జయంతి ఉత్సవాలు మాకెందుకు – వాల్మీకి నేతలు

నంద్యాల (పల్లెవెలుగు) 18 సెప్టెంబర్: సుదీర్ఘ కాలంగా వాల్మీకులను ఎస్టి లుగా పునరుద్ధరించమని పాలకులను అభ్యర్థిస్తున్నా ప్రతి పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎస్టి లుగా పునరుద్దరిస్తాం అని గద్దెనెక్కగానే వాల్మీకుల సమస్యను మరుగున పడేస్తున్నాయని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న, నంద్యాల పార్లమెంట్ గౌరవ న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బారాయుడు, పార్లమెంట్ అధ్యక్షులు గుర్రప్ప , మండల నాయకులు కాశన్న, బాలు, నియోజకవర్గ అధ్యక్షులు మదుగోపాల్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం స్థానిక కార్యాలయంలో పైనేతలు మాట్లాడుతూ 1956 కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులు ఎస్టి లుగా ఉండేవారని 1956 తరువాత వాల్మీకులను మైదాన ప్రాంతంలో నివసించే వారిని బీసీ లుగా ఏజన్సీ లో నివసించే బోయలను ఎస్టి లుగా చేసి ప్రాంతీయ వ్యత్యాసాన్ని నెలకొల్పారాని అప్పటినుండి ఇప్పటి వరకు వాల్మీకులు శాంతియుత ఉద్యమాల ద్వారా పోరాడుతున్నా పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని వాల్మీకి మహర్షి జయంతిని కూడా జరుపటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, వాల్మీకి మహర్షి తన ఆధికావ్యం రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి మానవ, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలని బోధించారని అలాంటి మహావ్యక్తి జయంతిని సెలవు దినంగా ప్రకటించలేక పోతున్నాయని ,తూతూ మంత్రంగా జయంతిని ప్రభుత్వాలు జరుపుతున్నాయని ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న 50 లక్షల బోయలలో ఆవేదన రోజు రోజుకు పెరిగి పోతున్నదని అందుకే వాల్మీకులను ఎస్టి లుగా పునరుద్ధరించే0త వరకు ప్రభుత్వాలు నిర్వహించే జయంతిలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకోక తప్పటం లేదని ప్రధాని హోదాలో కర్నూల్ లో మాట్లాడుతూ మేము అధికారంలోకి రాగానే వాల్మీకులను st లుగా పునరుద్దరణ చేస్తామని చెప్పిన మోడీ కూడా మాట తప్పారని ఈ మధ్య కొన్ని రాష్ట్రాలలో అనేక కులాలను ఎస్టి లుగా చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసి ,66 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలలో డిమాండ్ చేస్తున్న వాల్మీకులను మరువటం సహించ రానిదని  ,ఇప్పటికైనా మాయ మాటలు మాని వాల్మీకులను ఎస్టి లుగా పునరుద్ధరించాలని లేని పక్షము లో పాలకులపై వాల్మీకుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విఆర్పీఎస్ నేతలు లాయర్ వెంకీ,రవి,యువ నేతలు చిన్న మహేష్,వినోద్, పరమేష్, రమేష్, సవారీ, మధు తదితరులు పాల్గోన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button