
ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా
ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా
నంద్యాల (పల్లెవేలుగు) 06 ఫెబ్రవరి: Aicc ,PCC అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, DCC అధ్యక్షుల ఆదేశాలు మేరకు సోమవారం ఎల్ఐసి కార్యాలయం ఎదుట నంద్యాల కాంగ్రెసు పార్టీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య అద్యక్షతన కాంగ్రెస్ నిరసన ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కార్ దేశ సంపదను దగాకు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న సంగతి ఆదాని గ్రూప్ అతిపెద్ద ఆర్థిక కుంభకోణంతో బట్టబయలైంది అందరూ అనుకుంటున్నట్లే ఆదాని ప్రధాని నరేంద్ర మోడీకి బినామి అనే మాట తేట తెలమవుతుంది కేంద్రంలోని బిజెపి సర్కారు అవలంబిస్తున్న ప్రజా కంటక విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తోంది ప్రభుత్వ సంస్థలు ఉన్న నమ్మకంతో ప్రజలు దాచుకున్న వేలాదికోట్ల డబ్బులు అధికారం లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది స్వార్థపూరిత రాజకీయాల ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమైన బిజెపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తేదీ 6 2 2023 సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీవిత బీమా సంస్థ ఎల్ఐసి కార్యాలయాల ఎదుట నిరసన తెలియచేయటం జరిగింది. ఈ ధర్నాలో బిసి సెల్ చైర్మన్ సంపంగి రామక్రిష్ణ, చింతలయ్య, PCC అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు, ట్రెజరీ ప్రసాద్ కో ఆర్డినేటర్ ఫరూక్, శివ రామిరెడ్డి ఆర్టీసీ ప్రసాద్, చాబొలు సలాం, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.