
Dharmavaram
ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలపై ధర్నా
ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలపై ధర్నా
ధర్మవరం (పల్లె వెలుగు) 05 సెప్టెంబర్: పట్టణంలోని ధర్మవరం బ్రాంచ్ ఎల్ఐ ఏఎఫ్ఐ జేఏసీ పిలుపుమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు సాయంత్రం ఐదు గంటల వరకు ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం మెగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శివరాం మాట్లాడుతూ పాలసీలపై బోనస్ పెంచాలని, జీఎస్టీ ని రద్దు చేయాలని, పాలసీల లోను పై వడ్డీ రేటు తగ్గించాలని, పాలసీల పునరుద్ధరణ పై ఐదు సంవత్సరాల సడలించాలని తెలిపారు. అదేవిధంగా ఏజెంట్స్ వారి న్యాయమైన కోర్కెలు గ్రూపు ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, గ్రాజిటీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణారెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు చంద్రాయుడు, తో పాటు కాటంరెడ్డి, గోపినాథ్, రమేష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.