nandyala

ఎమ్మెల్సీ ki కృతజ్ఞయతలు తెలిపిన అల్ మేవ

ఎమ్మెల్సీ ki కృతజ్ఞయతలు తెలిపిన అల్ మేవ

నంద్యాల (పల్లెవేలుగు) 15 డిసెంబర్: ప్రధానమంత్రి జనవికాస్ కార్యక్రమం క్రింద నంద్యాలలో నిర్మించనున్న ఉర్దూ కళాశాలకు సంభందించిన ఆరు భవనాల సముదాయ నిర్మాణానికి అవసరమైన స్థలానికి సంబంధించిన ఫైల్ పై నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ స్థలం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో అకుంఠిత దీక్షతో కృషి చేసి చివరకు సమస్య పరిష్కరమయ్యే వరకూ పోరాడి నంద్యాల ఉర్దూ కళాశాల తరగతుల భవన సముదాయానికి స్థలాన్ని మంజూరు చేయించడంలో విజయం సాధించిన  ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకి తమ చేతులతో నోరు తీపి చేసి కృతజ్ఞతలు తెలుపుకున్న అల్ మేవా సంస్థ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబూలైస్ , అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇమ్రాన్పాషా, మహమ్మద్ సలీం మరియు ఆల్ మేవా సంస్థ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు సైఫుల్ల, నబీరసూల్, జాకీర్ హుస్సేన్, మాలిక్ బేగ్ మీర్జా ఇదే సమావేశం లో స్థానిక ఉర్దూ కళాశాలలో విద్యార్దిని, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ పోటి ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే దేశవాళీ విధ్యాభ్యాసంతో పాటు అంతర్జాతీయ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం కాబట్టి అందుకు సంభందించిన సబ్జెక్ట్ ను కూడా ప్రవేశ పెట్టేలా కృషి చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కి మెమొరాండం సమర్పించారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button