
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక ఉద్యమనేతల గెలుపుకు కృషి – ప్రజాసంఘలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక ఉద్యమనేతల గెలుపుకు కృషి – ప్రజాసంఘలు
కోసిగి (పల్లెవేలుగు) 10 ఫెబ్రవరి: మార్చి నెలలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డిని అలాగే పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నగరాజుల గెలుపునకు కృషి చేస్తున్నట్లు సీపీఐ, ఎఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శులు భాస్కర్ యాదవ్, ఎం.రాజు, వీరేష్ లు పేర్కొన్నారు. కోసిగి మండలంలోని పలు పాఠశాలలో కత్తి నరసింహ రెడ్డి, పోతుల నాగరాజు తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థి సంఘం నేతగా సమస్యల పై ఉద్యమిస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 28 ఏళ్ల పాటు పని చేసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నేతగా ఎదిగి అన్ని రకాల మేనేజ్మెంట్లకు చెందిన అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో ఎనలేని పోరాటాలు చేశారని వారు అన్నారు. అదేవిధంగా పట్టుభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు సామాజిక స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి జైలు జీవితాలు గడిపిన ఉద్యమనాయకుడాని వారు అన్నారు. 2007లో సామాజిక ఉద్యమాల కోసం తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి సామాజిక పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేసిన పోతుల నాగరాజును పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయ, పట్టుభద్రుల లోకానికి వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పెద్దకడబురు మండల కార్యదర్శి వీరేష్, ఎఐవైఎఫ్ నాయకులు జీవన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పురుషోత్తం, మల్లికార్జున, తిక్కన, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.