
ఎమ్మెల్యే సహకారంతో ముళ్ళ కంప చెట్లు తొలగింపు
ఎమ్మెల్యే సహకారంతో ముళ్ళ కంప చెట్లు తొలగింపు
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన కోసిగిలోని సిద్ధప్పపాలెంలో ఉన్నటువంటి మహిళలు మాల విసర్జన బహిర్ భూమికి వెళ్లే ప్రదేశంలో ముళ్ళకంప చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా మంత్రాలయం నియోజవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరియు మండల ఇన్చార్జి మురళీమోహన్ రెడ్డి వారి సహకారంతో యూత్ లీడర్ జగదీష్ స్వామి ఆధ్వర్యంలో స్పందించి జెసిబి ద్వారా చెట్లను తొలగించి పరిశుద్ధ పనులు చేపట్టారు యూత్ లీడర్ జగదీష్ స్వామి మాట్లాడుతూ సిద్ధపాలెంలో ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముళ్ళ చెట్లను తొలగించినందుకు 1,7,8,9 నివాసముంటున్న మహిళలు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో వార్డ్ మెంబర్ ఈరన్న, నాగరాజు, వీరస్వామి ముఖన్న, తిక్కోడు నరసింహులు, రాములమ్మ అల్లమ్మ, మునెమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.