nandyala

ఎమ్మెల్యే కు ఉర్దూ నేమ్ ప్లేట్ బహూకరణ

ఎమ్మెల్యే కు ఉర్దూ నేమ్ ప్లేట్ బహూకరణ

నంద్యాల (పల్లెవేలుగు) 01 అక్టోబర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉర్దూ భాష ను రాష్ట్ర రెండవ అధికార భాష గా ప్రకటించినందుకు కృతజ్ఞతా భావంతో  జమాన్ ఫౌండేషన్, నంద్యాల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ అధికారులు మరియు రాజకీయ నాయకులకు ఉర్దూ నేమ్ ప్లేట్స్ బహూకరిస్తున్న సందర్భంలో ఈ రోజు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ని కలిసి ఉర్దూ భాషను రెండో అధికార భాషగా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ “ఉర్దూ నేమ్ ప్లేట్” బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉర్దూ భాష ను మరింత బలోపేతం చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సచివాలయంలో ఒక ఉర్దూ ట్రాన్స్లేటర్ పోస్ట్ ను కేటాయించాలని, ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలను స్థాపించాలని మరియు నంద్యాల జిల్లాలో ప్రభుత్వ యునాని మెడికల్ కాలేజ్ ను కూడా స్థాపించాలని ఎమ్మెల్యే ని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి సమాధానం ఇస్తూ మన ప్రభుత్వం ఉర్దూ భాష అభవృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలముల్లా, వైఎస్ఆర్సిపి నాయకులు జాకీర్ హుస్సేన్, వైయస్సార్సీపి టౌన్ ప్రెసిడెంట్ కరాటే మహబూబ్ బాషా మరియు జమాన్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ వజీవుజ్ జమాన్ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button