panyam

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడం పై దారుణం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడం పై దారుణం

పాణ్యం (పల్లెవెలుగు) 21 సెప్టెంబర్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగించడం పై దారుణం మని బుధవారం విలేకరుల సమావేశంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి  మరియు టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధమని ఏన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదు, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమరావతి1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనం. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం 1998లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టారని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్ఆర్ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతుంది. వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం ఏ హక్కుతో పేరు మార్చుతుంది కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి. వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు, వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సిఎం జగన్ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ యన్ వి రామకృష్ణ, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, పాణ్యo నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు యస్ ఫిరోజ్, టీడీపీ జిల్లా కోశాధికారి మాదన్న, టీడీపీ సీనియర్ నాయకులు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, గోపి కృష్ణ పాల్గొన్నారు

Back to top button