
ఎంపీడీవో కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం
ఎంపీడీవో కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమం
నంద్యాల జిల్లా పట్టణంలో అక్టోబర్ 31 న ఎంపీడీవో కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో సన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సమస్త కార్యదర్శి అప్సర్ హుస్సేన్ అధ్యక్షతన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా జీ.వి .ప్రసాద్ రెడ్డి ఏవో , ఎస్ శ్రీకళ అడిషనల్ పిఓ మరియు రిసోర్స్ పర్సన్ కొమ్ము పాలెం శ్రీనివాస్ పాల్గొన్నారు 2019 అమెండ్మెంట్ రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో గురించి వివరించి చెప్పారు. అనంతరం చాపిరేవుల, జడ్పీ, హైస్కూల్ నందు విద్యార్థి, విద్యార్థులకు, రోడ్డు సేఫ్టీ ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాసులో ,సోషల్ స్టడీలో రోడ్డు భద్రత గురించి వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్ .ఏ. శ్రీనివాసులు, మరియు కె.వి లక్ష్మీదేవి టీచర్ పాల్గొన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 2019 చాప్టర్లు , 11 సెక్షన్లు 215 చెప్తున్నటువంటి అంశాలు గురించి వివరించి చెప్పారు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే సెక్షన్ 194 డి ప్రకారం వెయ్యి రూపాయలు ఫైన్ ఉంటుందని, అలాగే లైసెన్స్ మూడు నెలలు క్యాన్సల్ చేస్తారని, మైనర్ డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 198 ప్రకారం పిల్లవాడు గార్డెన్స్ లేదా వాహన ఓనర్లకు 2500 ఫైన్ తో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని, ఒక సంవత్సరం వరకు ఓనర్ లైసెన్సు రద్దు అవుతుందని ,ఎవరైతే మైనరు ఉంటాడో అతనికి 25 సంవత్సరాలు వచ్చేంతవరకు లైసెన్స్ అప్లై చేసే అర్హత ఉండదని ఈ చట్టం చెబుతుందని, రిసోర్స్ పర్సన్ కొమ్ముపాలం శ్రీనివాస్ గారు తెలియజేశారు. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘించినట్లయితే ,గతంలో తక్కువ ఫీజు ఉండే ,కొత్త చట్టం ప్రకారం ఫస్ట్ సారి పట్టుబడితే ఒక సంవత్సరం శిక్షతోపాటు వెయ్యి రూపాయల నుండి 5వేల రూపాయల వరకు పెనాల్టీ ఉంటుందని, రెండోసారి పట్టుబడితే పదివేల రూపాయలతో పాటు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు. అదేవిధంగా లవ్ హారన్ లేదా ఎక్కువ సౌండ్ హారన్ పెట్టుకున్న ఫస్ట్ టైం 1000 రూపాయలు, సెకండ్ టైం 2000 రూపాయలు ఫైన్ ఉంటుందన్నారు ,ఫోన్ డ్రైవింగ్ పట్టుబడితే వాహనాన్ని డ్రైవ్ చేస్తే అలాగే ఓవర్టేక్ చేస్తే పట్టుబడిన వారికిని ఆరు నెలలు జైలు శిక్షతోపాటు, 5000 రూపాయలు, రెండోసారి పట్టుబడితే పదివేల రూపాయలు మరియు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పట్టుబడితే, సెక్షన్ 181 ప్రకారం 5000 రూపాయలు చలానా చెల్లించాలని, ఓవర్ స్పీడ్ పట్టుబడితే సెక్షన్ 183 ప్రకారం 4 వేల రూపాయలు చలానా కట్టాలని, డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే సెక్షన్ 184 ప్రకారం ఫస్ట్ సారి 5000 ఒక సంవత్సరం జైలు రెండోసారి పట్టుబడితే పదివేల రూపాయలు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఉబేద్, హమ్మర్ భాష విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పాల్గొన్నారు.