kosigi

ఉల్లి పంటను క్వింటాళ్లు 2000 ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి – ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ డిమాండ్

ఉల్లి పంటను క్వింటాళ్లు 2000 ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి – ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ డిమాండ్

కోసిగి (పల్లెవెలుగు) 09 సెప్టెంబర్: ఉల్లి పంటను క్వింటాలు 2000 రూపాయల ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ శుక్రవారం వ్యవసాయ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో రైతులు ఉల్లి పంటను అధికంగా సాగు చేశారని ఒక్కో ఎకరాకు 50 వేల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టారని మార్కెట్లో ఉల్లి పంటకు ధర లేకపోవడంతో రైతులు పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని దీంతో రైతుల్లోదిక్కుతోచని పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు కొంతమంది రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే ట్రాక్టర్ తో దున్నివేశారని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన ఉల్లిరైతులకు వెంటనే పంట నష్టపరిహారం అందించాలని అదేవిధంగా ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలకు 2000 రూపాయల ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారి కోరారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఆర్టికల్చర్ అధికారి హనుమంతు గారికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్షులు వీరేష్ రైతులు హనుమంతు తిమ్మారెడ్డి ఈరన్న చింతకుంట ఈరన్న లో శ్రీనివాసులు నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button