nandyala

ఉర్దూ మున్సిపల్ పురపాలక పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి

ఉర్దూ మున్సిపల్ పురపాలక పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి

నంద్యాల (పల్లెవేలుగు) 16 డిసెంబర్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ ద్వితీయ భాషకు సంబంధించినా సమస్యల పైన ముఖ్యంగా నంద్యాల పట్టణ మున్సిపల్ ఉర్దూ స్కూల్లలో ముఖ్యంగా ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ లలో విద్యా వాలంటీర్లను నియమించ వలసిందిగా రియాసతి ఉర్దూ టీచర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు జమాన్  ఆధ్వర్యంలో మున్సిపల్ కో. ఆప్షన్ మెంబెర్ సలముల్లా తో ఉమ్మడి గా కలిసి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ ఉన్నిసా ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రూట జిల్లా అధ్యక్షుడు జమన్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ పాఠశాలలలో విద్యా వాలంటీర్లను నియమించాలని ముఖ్యంగా అప్ర ప్రైమరీ స్కూల్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నందువలన తక్షణం నియమించాలని మరియు ప్రభుత్వ ప్రధాన కార్యాలయల బోర్డులను ఉర్దూలలో కూడా రాయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ సలాముల్లా మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్లో చదివే పిల్లలు మన పిల్లలు కాబట్టి మున్సిపాలిటీ ద్వారా విద్యా వాలంటీర్లను నియమించాలని దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు మరియు ఉర్దూ అభివృద్ధి కోసం పాటుపడుతున్న రియాసతి ఉర్దూ టీచర్ అసోసియేషన్ ఉర్దూకు చేస్తున్న సేవలను కొనియాడారు. రూట రాష్ట్ర మున్సిపల్ కన్వీనర్ మాట్లాడుతూ అప్పర్ ప్రైమరీ స్కూల్లలో సబ్జెక్ట్ టీచర్లు నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దస్తగిరి భాష తదితరులు పాల్గొనడం జరిగింది.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button