
ఉర్దూ ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన – RUTA
ఉర్దూ ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన – RUTA
నంద్యాల (పల్లెవేలుగు) 03 డిసెంబర్: విద్యకు ఎంతో ప్రాముఖ్యనిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోని జగన్ సర్కార్ దానిలో భాగంగా నందమూరి నగర్ , నంద్యాల లోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ కి చుట్టూ ప్రహరీ గోడ మరియు టాయిలెట్స్ లేనందువల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు దీనిని గమనించిన నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ సలాముల్లా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జమాల్ వలి ఉపాధ్యాయులు జానీ భాష మరియు రుటా ( రియసతీ ఉర్దూ టీచర్ అసోసియేషన్) అధ్యక్షుడు జమాన్ నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ మాబున్నిసా దృష్టికి తేవడం జరిగింది. తదనంతరం 26 లక్షల రూపాయలతో మున్సిపల్ చైర్ పర్సన్ మాబునీసా భూమి పూజ చేసి పని మొదలుపెట్టిన సందర్భంగా RUTA (రియసతి ఉర్దూ టీచర్ అసోసియేషన్) నంద్యాల జిల్లా అధ్యక్షులు జమాన్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిసకి మరియు దీనికేంతో సహాయ సహకారాలు అందించిన కౌన్సిలర్ సలాముల్లాకి మరో కౌన్సిలర్ రమణకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూట రాష్ట్ర మున్సిపల్ కన్వీనర్ జానీ బాషా మాట్లాడుతూ స్కూల్ సమస్యను వేను వెంటనే పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించిన కౌన్సిలర్ సలాముల్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ దస్తగిరి మరియు జిల్లా రుటా నాయకులు హర్షం ప్రకటించడం జరిగింది.