
ఉమేన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
ఉమేన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
ధర్మవరం పల్లె వెలుగు ధర్మవరం పట్టణంలోని యస్.ఐ.యు చర్చి లో హాజరైన క్రైస్తవ స్త్రీలను ఉద్దేశించి హైదరాబాద్ నుండి వచ్చిన సిస్టర్ జ్యోతి రాజేశ్వరరావు మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధిస్తూ కీర్తిస్తూ ఆనందించడమే క్రిస్మస్ అని వారు తెలిపారు అదేవిధంగా లోక రక్షకుడు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనది అని యేసయ్యను కొలవడం ద్వారా తమ జీవితాలకు విముక్తి లభించడంతోపాటు ప్రపంచ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని క్రైస్తవులు నమ్మకం అని వారు సందేశాన్ని వినిపించారు. క్రైస్తవ స్త్రీలకు తదితర అంశాలను వారు వివరించారు ఈకార్యక్రమంలో యస్ ఐ యూ చర్చి సెక్రటరీ సుకుమార్ ,పాష్టర్ డానియేల్, దర్మవరం పాష్టర్స్ కమిటీ ప్రెసిడెంట్ పాష్టర్ యం.యన్.సుందర్ సింగ్ తదితర చర్చిలనుండి వచ్చిన స్త్రీలు పాల్గొన్నారు కార్యక్రమంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నార.