
ఉపాధ్యాయుల కొరత తీర్చిండి
ఉపాధ్యాయుల కొరత తీర్చిండి
కోసిగి (పల్లెవేలుగు) 04 నవంబర్: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, మండల కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కోసిగిలో ఏఐఎస్ఎఫ్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అక్షరాస్యతతో కోసిగి కౌతాళం వెనుకబడిన మండలాలు అలాంటి ఈ మండలాలలో మండలల పరిషత్ పాఠశాలలకు గ్రామాలలో ఉన్న హై స్కూల్ పాఠశాలలకు కొన్ని వందల మంది ఆసక్తితో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ కొన్ని పాఠశాలలో సరైన సబ్జెక్టుకు ఉపాధ్యాయులు లేక కొన్ని సబ్జెక్టులకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తామంటే ఉపాధ్యాయుల కొరత ఘాటుగా ఉండడం వలన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అంటే ఉపాధ్యాయుల కొరత అని నిదర్శనం అందువలన మా మండలాలలో పదవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అవ్వడంతో కొంత మంది విద్యార్థి తల్లిదండ్రులు స్త్రీ విద్యార్థులను అయితే పెళ్లిళ్లు చేయడం లేకపోతే ఇతర రాష్ట్రాలకు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు వలసలతో కూలి పనులకు తీసుకో వెళ్లడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అతి చిన్న వయసులో పెళ్లిళ్లు అవుతున్నాయి అంటే ముఖ్య కారణం పదవితరగతి ఫెయిల్ అవ్వడమే ముఖ్య కారణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందువలన విద్యార్థులు అతి చిన్న వయసులలో పెళ్లిళ్లు అరికట్టాలంటే విద్యార్థులు పదవ తరగతి ఫెయిల్ కాకుండా ఉండాలంటే ప్రతి పాఠశాలలో పాఠ్య పుస్తక సబ్జెక్టు మినయించి పదవితరగతి పబ్లిక్ ఎక్సమ్స్ దగ్గర పడకముందే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల బంగారు భవిష్యత్ కాపాడాలని ప్రభుత్వానికి కర్నూలు జిల్లా విద్యాధికారులకు హెచ్చరిస్తున్నాము లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఉపాధ్యాయులు కొరత ఉన్న పాఠశాలల కు వెళ్లి పాఠశాలలకు తాళాలు వేసి ధర్నా కార్యక్రమాలు ఏర్పరుస్తాము అలాగే కొన్ని పాఠశాలలో సమయపాలన లేకుండా డుమ్మా కొడుతున్న కొంత మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారని అలాంటి ఉపాధ్యాయులను విద్యార్థుల పక్షంలో పట్టుపడి DEO, MEO దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆయా పాఠశాలల విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మండల నాయకులు బాబు, హనుమంతు, మహేష్, లోకేష్, అశోక్,దినకర్ తదితరులు పాల్గున్నారు