Dharmavaram

ఉచిత సామూహిక వివాహ మహోత్సవాలను జయప్రదం చేయండి

ఉచిత సామూహిక వివాహ మహోత్సవాలను జయప్రదం చేయండి

ధర్మవరం (పల్లెవెలుగు) 11 నవంబర్: శ్రీ సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామం లో గల శ్రీ సద్గురు యోగి నారే యణ తాతయ్య ఆశ్రమంలో డిసెంబర్ 11వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల 45 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాల లోపు ఉచిత సామూహిక వివాహాలను నిర్వహించడం జరుగుతుందని ఆశ్రమ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో కొత్తపేటలో బుధవారం అధ్యక్షులతోపాటు జింక రాజేంద్రప్రసాద్, ఆదినారాయణ, ఓబులేసు, వెంకటరాముడు, అరుణ్ కుమార్, వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిలు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాతల ఉదార ఆర్థిక సహాయంతో, బసంపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, వేదమూర్తుల ఆశీస్సులతో ఈ వివాహా లను జరుపదలచామని తెలిపారు. పేదల కుటుంబంలో ఉన్నవారు, తమ పిల్లల వివాహాలు చేయలేని స్థితిలో ఉన్నవారు, ఆశ్రమ కమిటీ వారితో కలిసి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వధువు వయస్సు 18 సంవత్సరాలు వరుడు వయస్సు 21 సంవత్సరాలు తప్పక ఆధారాలతో సహా ఉండాలని తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 10వ తేదీ శనివారం రాత్రి 8 గంటలకు వాన రాశి బాలకృష్ణ భాగవతులు చే సద్గురు యోగి నారేయన తాతయ్య వారి బుర్రకథ కూడా ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8374552424 లేదా 9440286620 కు సంప్రదించాలన్నరు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button