
ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరం లాంటివి.. దాసరి వెంకటేశులు (చిట్టి)
ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరం లాంటివి.. దాసరి వెంకటేశులు (చిట్టి)
ధర్మవరం (పల్లె వెలుగు) 27 నవంబర్: ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరం లాంటివని శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేశులు ( చిట్టి) పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో ఆదివారం శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ దేవాలయ ప్రాంగణమునందు 82వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా శీలం సావిత్రమ్మ ,శీలం శ్రీ రాములు కుమారుడు శీలం రమ్య నాగిని, శీలం జయప్రకాష్ లు వ్యవహరించారని తెలిపారు. ఈ శిబిరములోని రోగులకు డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూపులు, వైద్య చికిత్సలను అందించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరములో 180 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాలు, దాతల సహాయ సహకారములతో విజయవంతం కావడం పట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బందనాథం చిన్నికృష్ణ, కోశాధికారి బంధనాథం వెంకటరమణ, సహాయ కార్యదర్శి బండి నాగరాజు, సభ్యులు సిరివెళ్ల రాధాకృష్ణ, పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్ ,మామిళ్ళ అశ్వత్ నారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.