
ఉచిత గుండె,షుగర్ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి.. డాక్టర్ అరిగెల గణేష్
ఉచిత గుండె,షుగర్ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి.. డాక్టర్ అరిగెల గణేష్
ధర్మవరం (పల్లెవెలుగు) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు అరిగెల పోతన్న ఆసుపత్రిలో శనివారం ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు ఉచిత గుండె, షుగర్, డయాబెటిక్ న్యూరోపతి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అరిగెల పోతన్న హాస్పిటల్ అధినేత డాక్టర్ అరిగెల గణేష్ శుక్రవారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో గుండెనొప్పి, గుండె దడ, ఆయాసము, కళ్ళు తిరగడం, చాతిలో బరువుగా ఉండడం, కాలు వాపు రావడం, వెన్నునొప్పి తదితర సమస్యలకు వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. బయో తిసియో మీటర్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి కంప్యూటర్ ద్వారా రిపోర్టు ఇవ్వబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440312707 కు సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.