
ఉచిత కంటి శిబిరమును సద్వినియోగం చేసుకోండి… రోటరీ క్లబ్ ప్రతినిధులు
ఉచిత కంటి శిబిరమును సద్వినియోగం చేసుకోండి… రోటరీ క్లబ్ ప్రతినిధులు
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 4 పట్టణంలోని కోట మున్సిపల్ స్కూల్ నందు ఈనెల 9వ తేదీ ఆదివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ ,కోశాధికారి జయసింహ, క్యాంపు చైర్మన్ నరేంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు వారిచే నిర్వహించబడుతుందని తెలిపారు. కంటి చికిత్సలకు విచ్చేయువారు 3 ఆధార్ జిరాక్స్ ప్రతులు, మూడు రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు జిరాక్స్ ప్రతులు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకొని రావాలని తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు బండారు నారాయణమ్మ, బండారు శివయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బండారు శ్రీనివాసులు, బండారు రత్నమ్మలు వ్యవహరించడం జరుగుతుందన్నారు. బెంగళూరుకు కంటి ఆపరేషన్ కొరకు రవాణా సౌకర్యముగా దాతలుగా కీర్తిశేషులు పుల్లకి రెడ్డి గారి కుమారుడు రామచంద్ర రెడ్డి మరియు వారి మిత్ర బృందం వ్యవహరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కంటి దానంపై అవగాహన చేసుకుని, నేత్రదానం చేసి ప్రాణదాతలు కావాలని అప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ అధ్యక్ష, కార్యదర్శులు జయశ్రీ సుమలత తదితరులు పాల్గొన్నారు.