
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి… రోటరీ క్లబ్ ప్రతినిధులు
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి… రోటరీ క్లబ్ ప్రతినిధులు
ధర్మవరం పల్లె వెలుగు పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోటరీ క్లబ్ శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ, కోశాధికారి జయ సింహ, క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సాంస్కృతిక మండలిలో కంటి శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ వెంకటరమణమ్మ జ్ఞాపకార్థం వారి భర్త మామిళ్ళ రంగనాయకులు అండ్ సన్స్ వారు, రవాణా సౌకర్యం దాతగా కీర్తిశేషులు కే ఉలక్కిరెడ్డి కుమారుడు కె. రామచంద్రారెడ్డి అండ్ మిత్రబృందం వ్యవహరించనున్నారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు హరినాథ్, సుదర్శన్ గుప్తా, నాగభూషణ, సోలిగాల వెంకటేశు, సత్రశాల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు