
ఉచిత ఆరోగ్య క్యాంపెనుకు విశేష స్పందన
ఉచిత ఆరోగ్య క్యాంపెనుకు విశేష స్పందన
కోసిగి లో మంగళవారం నిర్వహించిన ఉచిత క్యాంపెయిన్ కు కోసిగి మరియు పల్లెల ప్రజలు సుమారుగా 370 మంది ఆరోగ్యపరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా మానస మెడికల్ స్టోర్ బసవరాజు మాట్లాడుతూ పల్లెల్లో ఉన్న ప్రజలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పట్టణాలకు వెళ్లి డాక్టర్లతో చూపించుకునే వాళ్ళు అని ప్రజల రవాణా ఇబ్బందుల గురించి ఆలోచించి, ప్రజలకు ఉన్నతమైన డాక్టర్లను కోసిగి పిలిపించి డాక్టర్లను కోసిగి ప్రజలకు మరియు పల్లెల ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో, మరియు గర్భిణీ స్త్రీలు పట్టణాలకు వెళ్లి ఇబ్బందులు పడుతూ చూపించుకునే పరిస్థితి ఉండకూడదని కోసిగిలో ప్రతి మంగళవారం బస్టాండ్ ప్రక్కన డాక్టర్స్ సందర్శిస్తారని ప్రజలు గమనించి అవకాశంను ఉపయోగించుకోవాలి.డాక్టర్ వశీమ్ అక్రమ్ ఎంబీబీఎస్.ఎండీ. ప్రత్యేకతలు బిపి, షుగర్, గుండె వ్యాధులు, విష జ్వరాలు, పాయిజనిoగ్, శ్వాస కోస వ్యాధులు,డాక్టర్ సభా తబస్సుమ్ ఎంబిబిఎస్ డి ఎన్ బి.గైనాకాలజిస్ట్. ప్రత్యేకతలు డెలివరీలు, సిజేరియన్లు, ట్యూబెక్టమీ, హిస్టరెక్టమీలు, క్యాన్సర్ స్క్రీనింగ్ లు అన్ని రకముల గర్భకోశ వ్యాధులకు సంతానము లేని వారికి సంతాన సాఫల్యం కొరకు ప్రత్యేక చికిత్స చేయబడును. మరియు ప్రజలకు అందుబాటుగా, మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు ఆదోని జ్యోతి స్పెషాలిటీ క్లినిక్ నందు అందుబాటులో ఉండబడనని తెలిపినారు.