
ఈనెల 31న కౌన్సిల్ సమావేశం… మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల
ఈనెల 31న కౌన్సిల్ సమావేశం… మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల
ధర్మవరం (పల్లె వెలుగు) పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఈనెల 31వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశమును కౌన్సిల్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజెండాలోని 35 అంశాలను చదివి వినిపించిన తర్వాత, చర్చ అనంతరం కౌన్సిల్ తో ఆమోదం పొందడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వార్డులోని పలు సమస్యలపై కూడా చర్చించి పరిష్కార దిశకు కృషి చేయడం జరుగుతుందన్నారు. టెండర్ల దాఖలు పై కూడా చర్చించబడునని, టెండర్ల రేట్లు పరిశీలించడం అర్హత గల వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వార్డుల అభివృద్ధికి కావలసిన సలహాలను, సూచనలను తీసుకొని వచ్చిన నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కావున వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు సకాలంలో సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయవలసినదిగా వారు కోరారు.