
ఇష్టపడి చదవండి మంచి ఫలితాలను పొందండి – డోలా పెద్దిరెడ్డి
ఇష్టపడి చదవండి మంచి ఫలితాలను పొందండి – డోలా పెద్దిరెడ్డి
సత్యసాయి జిల్లా ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 17 ధర్మవరం పట్టణం శ్రీ సత్యకృప మహిళా డీగ్రీ కళాశాల నందు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సెమిస్టర్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను కేక్ కట్ చేసి అనంతరం కళాశాల కరస్పాండెట్ డోలా పెద్దిరెడ్డి మాట్లాడుతూ….ఇష్టపడి చదవండి మంచి ఫలితాలను పొందండి అని తెలుపుతూ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మిఠాయిలు పంచి పాఠాలు బోధించిన అధ్యాపకులను అభినందనలు తెలిపారు.బి.యస్సీ స్టాట్స్ గ్రూప్‌లో మౌనిక 97% అస్మతున్నీసా 96% మునీర 95% బి.యస్సీ ఫిజిక్స్ గ్రూప్ లో యమున 91% కావ్య 85% హరతి 82% బి. యస్సి ఎలక్ట్రానిక్స్ గ్రూప్ లో సమీర తబ్సమ్ 93% జ్యోతి 92% సుమిత్ర 91% బి.కామ్ గ్రూప్‌లో రేవతి 91% చందన 88% లోకేశ్వరి 88% ముత్యాలమ్మ 87% బి.బి.ఏ గ్రూప్‌లో తనుశ్రీ 84% ముకుటేశ్వరి 81% ఇందు 81% మొదటి సెమిస్టర్ ఫలితాలలో అతుత్తమ్మ ప్రతిభ కనపరిచినందుకు విద్యార్ధి తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున హర్షం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఏ. ఓ రమేష్ పాల్గొన్నారు.