Allagadda

ఆళ్ళగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆళ్ళగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 13 డిసెంబర్: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి IPS మంగళవారం ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు.

చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ అఫెన్స్ (దొంగతనాలు, హౌస్ బ్రేకింగ్) కేసుల డస్త్రాలను పరిశీలించి త్వరగా రికవరీ చేసి సంభందిత ఫిర్యాదిదారులకు అందించాలని ఆదేశించారు.

నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, అరికట్టాలని ఆదేశించారు.

క్రైమ్ అగెనెస్ట్ ఉమన్ కేసులకు సంబంధించి  ఏమైనా పిర్యాదులు వచ్చిన యెడల సత్వరమే స్పందించాలని ,మహిళల అదృశ్యం కేసులు పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ త్వరగా కనుగొని సంబంధించిన వారికి అప్పగించాలని ఆదేశించారు.

మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై  అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని  ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని త్వరగా డిస్పోజల్ చేయాలని ఆదేశించారు.

ఆళ్లగడ్డ  టౌన్ లో నైట్ బీట్ మరియు బ్లూకోట్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, రాత్రి వేళలో గస్తీ నిర్వహించి ఎలాంటి దొంగతనాలు (ప్రాపర్టీ అఫెన్స్ లు) జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

విచారణలో ఉన్న పాత పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పట్టణంలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్టేషన్ SHO ని ఆదేశించారు.

సిబ్బందితో మాట్లాడి స్టేషన్ పరిధిలో మీ యొక్క విధులలో అలసత్వం లేకుండా పనిచేయాలని ఆదేశిస్తూ వారి  సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆళ్లగడ్డ టౌన్ డిఎస్పి ఐ. సుధకర్ రెడ్డి, SP సి. సి. ఫయాజ్ బాష పాల్గొన్నారు.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button