nandyala

ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాల్మీకి పిక్కిలి నరహరిని సన్మానించిన – విఆర్పీఎస్ నేతలు

ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాల్మీకి పిక్కిలి నరహరిని సన్మానించిన – విఆర్పీఎస్ నేతలు

ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 28 నవంబర్: ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సిరివెళ్ల మండలం మహాదేవాపురం కు చెందిన వాల్మీకి పిక్కిలి నరహరిని ఘనంగా సన్మానించిన వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న, విఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మీనిగ నారాయణ, శ్రీశైల నియోజకవర్గ అధ్యక్షులు భూపని వెంకటేశ్వర్లు, మహానంది మండల అధ్యక్షులు జయరాం, రుద్రవరం నాయకులు బాలరంగయ్య, పామన్న, ఆళ్లగడ్డ నాయకులు వెంకటేశ్వర్లు, నేతాజీ, లక్ష్మినరసింహులు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ఆళ్లగడ్డ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు మెచ్చే నేతలుగా మంచి పేరు సంపాదించుకొని భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని వైస్ చైర్మన్ వాల్మీకి నరహరికి సలహా ఇచ్చారు అనంతరం ఆళ్లగడ్డ కూడలిలో నాయకులతో కలిసి వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలంకరణ చేశారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button