
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం నూతన కమిటీ
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం నూతన కమిటీ
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ చైర్మన్ తబ్జుల శ్రీనివాసులు,డైరెక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో నూతన కమిటీని ఆలయ ఈవో వెంకటేశులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత వారందరి చేత ఆలయ ఇన్స్పెక్టర్ వన్నూరు స్వామి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. నూతన కమిటీలో చైర్మన్ తబ్జులు శ్రీనివాసులు, డైరెక్టర్లుగా చింత కృష్ణయ్య( లాయర్), పెద్దిరెడ్డి గారి నాగిరెడ్డి,గాలి సుశీల, చింతా వసుంధర, ధారా బాల పెద్దక్క, జుజారు చితంబరి బాయ్ తో ఏడు మంది కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. అనంతరం నూతన కమిటీ పేరిటన అర్చకులు శ్రీధర్ శర్మ పూజలు నిర్వహించారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు వరకు కొనసాగుతుందని ఈవో తెలిపారు.