
ఆర్ సి సి 3వ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
ఆర్ సి సి 3వ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
కోసిగి (పల్లెవేలుగు) 07 డిసెంబర్: రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ అంశాలపై జరిగే ఆట పాట మాట సీమ పిలుపు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. ఈ రోజు రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ (RCC) ఆధ్వర్యంలో ఆర్.సి.సి 3వ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. డిశంబర్ 22 న రిక్రేయేషన్ క్లబ్ మైదానంలో జరిగే రాయలసీమ అంశాలపై ఆట మాట పాట కార్యక్రమం అలాగే రాయలసీమ కరవు,వలసలు,విద్య,నీటి ప్రాజెక్టులు నిర్మించాలి అని జరిగే సీమ పిలుపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోసిగి మండలంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రతాప్, రవివర్మ, అనిల్, మాట్లాడుతూ రాయలసీమకు దక్కాల్సిన నీటి వాటా ఈ ప్రాంతంలో విస్తారంగా లభించే ఖనిజ సంపదల ఆధారంగా వెనుకబాటుతనం, కరువు, వలసలు రూపుమాపడానికి ప్రణాళిక రూపొందించాల్సిన పాలకులు ఈ ప్రాంతాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం అన్నారు. అందుకోసమే ఈ నెల 22న కోస్తా, రాయలసీమ మధ్య సమతుల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నీటి ప్రాజెక్టులు నిర్మించాలని జరిగే కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోసిగి RCC కమిటీ సభ్యులు అయ్యప్ప వీరేష్ , వెంకటేష్ , కోసిగయ్య, తదితరులు పాల్గొన్నారు.