nandyala

ఆర్ జి యమ్ ,పాఠశాల క్రీడా దినోత్సవం,

  • ఆర్ జి యమ్ ,పాఠశాల క్రీడా దినోత్సవం,
  • విద్యతోపాటు క్రీడలు అవసరం. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మిద్దె శివరాం

నంద్యాల (పల్లెవెలుగు) 07 డిసెంబర్: స్థానిక నంద్యాల పట్టణ శివారులోని లోని ఆర్.జి.యం. అంతర్జాతీయ పాఠశాలయందు 18 వ క్రీడా దినోత్సవం ఆకాశమే హద్దుగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్  జి. గాయత్రి  మాట్లాడుతూ ఆర్. జి. యం. ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యం కలిపించాలనే ఉద్దేశ్యంతో పాఠశాల సమయంలో 30 శాతం క్రీడలకు కేటాయించామన్నారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపుటకు, పోటీ తత్త్వం పెంచుటకు ప్రతి సంవత్సరం ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తున్నాం. అలాగే పాఠశాల విద్యార్థులను నాలుగు హౌసులు అక్షయ, మహిమ, సాధన మరియు ఉజ్వలగా విభజించాము, ముందుగా వీరికి వారి వారి హౌసులతో పోటీ నిర్వహించి ఇతర హౌసులతో పోటీ నిర్వహణ జరిగింది. విద్యార్థులను తరగతి వారీగా కబ్స్, సబ్ జూనియర్స్, జూనియర్స్ మరియు సీనియర్స్ అని నాలుగు కేటగిరీలుగా విభజించి దాదాపుగా 127 అథ్లెటిక్ ఈవెంట్స్ మరియు గేమ్స్ నిర్వహించడం జరిగిందని,  నవంబర్ నెలలో తమిళనాడులోని . కాట్ పాడి,లో జరిగిన సి,బి ఎస్ ,ఇ , సౌత్ జోన్ గేమ్స్ లో బాల బాలికలు హ్యాండ్ బాల్ పోటీలో పాల్గొన్నారు. అలాగే నెల్లూరులో జరిగిన సి, బి,ఎస్, ఇ, క్లస్టర్స్ స్కూల్ గేమ్స్ కు బాస్కెట్ బాల్ ,బాల బాలికల జట్టు వెళ్లారు. హైదారాబాద్ లో జరిగిన సి,బి ఎస్, ఇ, ఇ,  క్లస్టర్స్ స్కూల్ గేమ్స్ కు ఫుట్ బాల్ గేమ్ కు బాలల జట్టు పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఇలా ఐదు టీమ్ లను వేరు వేరు రాష్ట్రాలలో జరిగిన డాపోటీలకు వెళ్లారు. పిల్లలో దాగిన ప్రతిభ వెలికి తీసి గొప్ప క్రీడా. కారులుగా తీర్చిదిద్దడమే పాఠశాల ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్  యం. శివరామ్  పాల్గొన్నారు. ముఖ్య అతిథిగారు ఒలంపిక్ టార్చ్ ను వెలిగించి, స్పోర్ట్స్ మీట్, ను ప్రకటించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ మీరందరూ విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల మెరుగైన ప్రతిభ కనపరిచి దేశ, విదేశాలలో క్రీడా పోటీలలో పాల్గొని దేశ గౌరవం, దేశ ప్రతిష్టను కాపాడే బావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు, స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు విద్యా, క్రమశిక్షణ చాలా అవసరం. స్కూల్ అనేది విద్యార్థుల పురోగతికి తొలి మెట్టు. వ్యక్తిగత క్రమశిక్షణ తో మీరు అందరూ ఎదగాలని ట్రాఫిక్ రూల్స్ ఎలాగైతే ఎవరు చెప్పక పోయిన పాటిస్తామో అలాగే అన్నీ చోట్ల క్రమశిక్షణ చాలా అవసరం. క్రీడలను స్పూర్తితో ఆడాలి, ఖతర్ లో నిర్వహిస్తున్న ఎఫ్, ఐ ఎఫ్ ,ఏ. ఫుట్ బాల్ కప్ కి 16 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే క్రీడలకి ఎంత ప్రధాన్యత ఉందో తెలుసుకొని ప్రతి సెకను గెలుపు కోసం ప్రయత్నించాలని, యన్, సి,సి.ని ప్రతి ఒక్క అమ్మాయి ఉపయోగించు కోవాలని అందరూ వ్యక్తిగతముగా, శారీరకముగా, మానసికముగా ఎదిగి అన్నీ క్లస్టర్స్ గేమ్స్ లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి, స్కూల్ కి మంచి పేరు తీసుకు రావాలని హితబోధచేసారు. తరువాత కార్యక్రమంగా ట్రాక్ ఈవెంట్స్, ఫీల్డ్ ఈవెంట్స్ ను విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు చేసిన డ్యాన్స్ అలరించాయి. ఈ కార్యక్రమం చివరిగా  జాతీయ గీతంతో ద్విగ్విజయంగా ముగిస్తూ, ఆటల పోటీలలో విజయం సాదించిన హౌసులకు, ఇతర అథెల్ట్స్ కు ముక్య అతిధి చేతుల మీదుగా అవార్డు, మేడల్స్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి. గాయత్రి, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్  రవి కుమార్ . బోధన, బోధనేతర బృందం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button