
ఆర్జీయమ్ ఇంజనీరింగ్ కళాశాలలో జెఎన్ టీయూ స్థాయిలో బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
ఆర్జీయమ్ ఇంజనీరింగ్ కళాశాలలో జెఎన్ టీయూ స్థాయిలో బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
పాణ్యం (పల్లెవెలుగు) 29అక్టోబర్: మండలం లోని ఆర్ జి యమ్ కళాశాలలో అమెరికాలో ఎంతో ప్రజాదరణ కలిగిన బాస్కెట్ బాల్ క్రీడ లో మన యువత కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జె ఎన్ టియూ బాస్కెట్ బాల్ జట్టు కు క్రీడాకారుల ఎంపిక పోటీలు నంద్యాల ఆర్జీయమ్ ఇంజనీరింగ్ కళాశాల లో నిర్వహించారు. అనంతపురం జె ఎన్ టి యూ పరిధిలోని 32 కళాశాల లనుండి 62 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు.శాంతి రాం ఫార్మసీ లో జెఎన్టీయూ స్థాయిలో కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈ పోటీలను యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ బి జోజి రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంపిక అయిన క్రీడాకారులు సౌత్ జోన్ తరపున బెంగళూరు లో జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు హాజరవుతారని అన్నారు. సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు ఈ జట్టుకు శిక్షణ ఇస్తారన్నారు.అయితే 2008 లో అనంతపురం జెఎన్ టీయూ ఆవిర్భావించినప్పటినుండి ఇప్పటి వరకు 20 క్రిడా పోటీల నిర్వహణ కు వ్యయ ప్రయాసలు కోర్చి సహకరించిన ఆర్జీయమ్ శాంతి రాం విద్యాసంస్థల ఛైర్మన్ డా శాంతి రాముడు కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డా అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలలో విద్యార్థులు చదువులో, క్రీడల్లో,ఉపాధి అవకాశాల్లో సత్తా చాటడమే తమ లక్ష్యమని అన్నారు.అందుకే కళాశాల లో అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ ఎం ఎన్ వి రాజు, నెల్లూరు జిల్లా కు చెందిన బాస్కెట్ బాల్ కోచ్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కు చెందిన బాస్కెట్ బాల్ కోచ్ శ్రీనివాసరావు, ఇండియన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ నాగ చంద్ర,,ఆకాంక్ష జూనియర్ కళాశాల బాస్కెట్ బాల్ కోచ్ నవీన్, ఆర్జీయమ్ విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్ వెంకటేష్, కోచ్ లు, సుబ్బరాజు, నాయక్ పాల్గొన్నారు.