ఆదర్శ ఉపాధ్యాయులకు ఐటా తరపున అవార్డుల ప్రధానం
ఆదర్శ ఉపాధ్యాయులకు ఐటా తరపున అవార్డుల ప్రధానం
కడప (పల్లెవేలుగు) 26 అక్టోబర్: ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (AIITA) ఉమ్మడి కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జ్యూరీ సభ్యుల ద్వారా ఎంపిక చేయబడ్డ ఆదర్శవంతమైన 12 మంది ఉపాధ్యాయులను డిస్టిక్ ఐడియల్ టీచర్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగినది. వీరు అవార్డు కోసం ఎటువంటి దరఖాస్తు చేసుకోరు జ్యూరీ సభ్యులే క్షుణ్ణంగా విచారించి ఎంపిక చేస్తారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో డిస్ట్రిక్ ఐడియల్ టీచర్ అవార్డు గ్రహీతలకు, ముఖ్య అతిథులుగా హాజరైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విశ్రాంత ఉప కులపతి ప్రొఫెసర్. ఎస్.ఎం.రహమతుల్లా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సత్తార్ సాహిర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేయడం జరిగినది.
అవార్డు గ్రహీతలు
- 1) మౌలాన ముఫ్తీ సయ్యద్ సయీద్ అహ్మద్ బాఖవి, కడప
2) సయ్యద్ అలీ అక్బర్, కడప మండలం
3) అల్లంన్నగారి అక్బర్ బాషా, వేంపల్లి మండలం
4) బేపారి ఫక్రుద్దీన్, కడప కార్పొరేషన్
5) హెచ్.నుస్రత్ బాను, కడప మండలం
6) సయ్యద్ సబీహా బేగం వల్లూరు మండలం
7)S.మహబూబ్ చాంద్ మేడం, చెన్నూరు మండలం
8)షకీరా బేగం ఖాదిరి, కడప కార్పొరేషన్
9) డా.షేక్ అహ్మద్ కబీర్, పెనగలూరు మండలం
10)షేక్ తాజున్నీస, రాజుపాలెం మండలం
11)P.రియాజ్ ఖాన్, CK దిన్నె మండలం
12) షేక్ ఖమ్రుద్దీన్ ప్రైవేట్ స్కూల్ టీచర్.
అవార్డు గ్రహీతలు ఇంకా అత్యుత్తమంగా పనిచేయాలని వారి బాధ్యత మరింత పెరిగిందని వక్తలు తెలియజేసినారు అదే విధంగా జూనియర్ కాలేజీలు డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యూవెట్ విద్యార్థులకు, మహమ్మద్ ప్రవక్త గారి జీవిత చరిత్ర పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెమొంటోలు మరియు బహుమతులు ముఖ్య అతిథుల చేతులమీదుగా ప్రధాన చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తో పాటు ఐటా రాష్ట్ర అధ్యక్షుడు S.అబ్దుల్ రజాల్, జాతీయ కార్యదర్శి ఎస్.షాకీర్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు ఎస్.నజీర్ బాషా, కార్యదర్శి ఎస్.అబ్బాస్ అలీ తదితరులు పాల్గొన్నారు మరియు జిల్లా నలు వైపుల నుండి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు 150 మందికి పైగా హాజరైనారు