kosigi

ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి

ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి

కోసిగి (పల్లెవెలుగు) 15 అక్టోబర్: గత వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సియం జగనన్న పాలనలో ప్రతి రైతుకు అండగా ఉంటామని కోసిగి మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పి.మురళీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో మండల వ్యవసాయ అధికారి రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి సమావేశంకు ముఖ్య అతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమీక్ష సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను  సంబంధించిన అధికారులతో విచారణ చేపట్టి, నివేదికలను తయారుచేసి ఉన్నత అధికారులకు పంపించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. డ్రోన్ ద్వారా పురుగు మందులను పిచికారీ యంత్రం ప్రభుత్వం 10లక్షలకు అందజేయగా అందులో 4 లక్షల సబ్బడీ అందివ్వడం జరుగుతుందని, రైతులు గ్రూప్ గా ఏర్పడి అధికారులను సంప్రదించాలని, అలాగే ప్రతిరైతు ఈ కేవైసీ తప్పనిసరి అని,ఈ కేవైసీ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఆర్హల జాబితా చేర్చడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రేపటిలోగా సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో యంపీపీ ఈరన్న, యన్.నాగరాజు, జగదీష్ స్వామి, సభ్యులు, సచివాలయ వ్యవసాయ అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button