
ఆకలి రాజ్యం. నిరుద్యోగ భారతం మెమొరాండం
ఆకలి రాజ్యం. నిరుద్యోగ భారతం మెమొరాండం
నంద్యాల (పల్లెవేలుగు) 31 అక్టోబర్: నంద్యాల లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అన్సర్ భాష ఆధ్వర్యంలో జాతీయ ప్రచార ఉద్యమం ఆకలి రాజ్యం – నిరుద్యోగం లో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షులు అన్సర్ భాష నంద్యాల జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సామూన్ ని కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగింది మరియు ఎమ్మార్వో ఎం శ్రీనివాసులు ని మరియు ఆర్డీవో ఏవో ప్రియదర్శినికి కలిసి మెమోరండం ఇవ్వడం జరిగింది. మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు నిరుద్యోగం ప్రధానమైనది ఈ రెండు సమస్యలు పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం రెండు విఫలమ య్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఆన్సర్ భాష, సభ్యులు ఫిరోజ్, బాసిత్, ఫాజిల్, సికిందర్, మహబూబ్ బాషా, అబ్దుల్లా ,నాసిర్ , పార్టీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.