nandyala

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం నూతన భవన ప్రారంబోత్సవం

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం నూతన భవన ప్రారంబోత్సవం

నంద్యాల (పల్లెవేలుగు) 28 నవంబర్: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం నూతన భవన ప్రారంబోత్సవం 28 సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ ఛైర్మన్ రాకేశ్ కశ్యప్ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ చైర్మన్ రాకేశ్ కశ్యప్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యం లో 75 శాఖలతో దాదాపుగా 5.5 లక్షల ఖాతాదారులకు గత 10 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తూ అన్ని బ్యాంకులకన్నా అగ్రగామిగా నిలిచిందని తెలియ చేయటానికి సంతోషిస్తూన్నామని తెలిపారు. అదేవిధంగా ఖాతాదారులకు అతి త్వరగా రుణాల మంజూరు కోసమై నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సరళ ఋణ కేంద్రాన్ని, పద్మావతి నగర్ నందు బ్యాంక్ చైర్మన్ రాకేశ్ కశ్యప్ మరియు నంద్యాల ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ P S నవీన్ కుమార్ ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఖాతాదారులకు వివిధ సదుపాయాలకు 11 కోట్ల రూపాయలు ఋణాలు మంజూరు చేయటం జరిగినది. అనతరం బ్యాంక్ చైర్మన్ రాకేశ్ కశ్యప్ మాట్లాడుతూ రిటైల్ ఋణ మహోత్సవం లో భాగంగా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా ఋణాలు అతి తక్కువ వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ సరళ ఋణ కేంద్రం ద్వారా ఋణాలు మంజూరు చేయటం జరుగుతుందని అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేక రాయతి కలదు. అని తెలిపారు. ఈ రిటైల్ ఋణ మహోత్సవములు అక్టోబర్ 01 నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో రీజనల్ మేనేజర్ P.S. నవీన్ కుమార్, చీఫ్ మేనేజర్ తౌర్య నాయక్, సీనియర్ మేనేజర్లు బి. వంశీ కృష్ణ, సరళ ఋణ కేంద్ర మేనేజర్ పి రమేష్ బాబు, నంద్యాల టౌన్ బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గోన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button