kosigi

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 8 9 10 తేదీలలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కే. లింగన్న పిలుపునిచ్చారు. ఈ దినం కోసిగి లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న  సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు ఆదివాసి పోరాట నాయకురాలు బృందాకారత్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్ష ,కార్యదర్శులు ఏ విజయ రాఘవన్, బి వెంకట్, తదితరులు పాల్గొంటారని ఈ బహిరంగ సభలో వేలాదిమంది వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం 2 రోజులపాటు ప్రతినిధుల సభ జరుగుతుందని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా ఉపాధి చట్టం అమలు, వలసలు, భూమి,ఇళ్ళు, ఇళ్ల స్థలాలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి కే రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర, హనుమంతు, ఆదెప్ప, తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button