
ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎం లక్ష్మన్న మాదిగ రాజీనామా
- ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎం లక్ష్మన్న మాదిగ రాజీనామా
- నా రాజనామా పత్రాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాదిగకు అందజేశాను
- ఇక మీదట నుంచి ఏ.పీ ఎం.ఆర్పి.ఎస్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు లక్ష్మన్న
పాణ్యం (పల్లెవేలుగు) 13 డిసెంబర్: ఏపీ ఎమ్మార్పీఎస్ నందు పని చేసినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి నాకు సహకరించిన వారందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఏదైనా అన్యాయం చేసినట్లు అయితే నన్ను కార్యకర్తలందరూ క్షమించగలరు అని ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎం లక్ష్మన్న మాదిగ అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ వ్యవహార తీరు మరియు కార్యకర్తల పట్ల ఆయన మాట్లాడే భాష బాగాలే నందు వల్లే బయటికి వెళ్లానన్నారు. నిన్న జరిగిన అనగా 12 డిసెంబర్ 22 న, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. జె ప్రకాష్ మాదిగ నాయకత్వంలో మరియు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.సి. వెంకటసుబ్బయ్య మాదిగ, అలాగనే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర న్యాయసలహా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి బాలస్వామి తదితరుల సూచనలు, సలహాల మేరకు నన్ను నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. అదే విధంగా నా ఎన్నిక పట్ల వాళ్లు హర్షాన్ని వ్యక్తం చేశారు. బాధ్యతలు తీసుకుంటూ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీకి, వివిధ జిల్లాల అధ్యక్షులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క ఆత్మీయ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా జై భీములతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇక మీదట నుంచి ఆర్.జె. ప్రకాష్ మాదిగ నాయకత్వంలో బలోపేతంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా ప్రతి పల్లె తిరిగి పునర్నిర్మాణం మనము మేమందరం కలిసి చేపడతామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.