
అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి
అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి
అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమళ్ళా రహీమ్, చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా, ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల పట్టణ కోశాధికారి సయ్యద్ మౌలాలి, హాజరు కావడం జరిగింది. అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకూమాళ్ళ రహీమ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ,ప్రపంచ మేధావి, భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అనేక అవమానాలు అడ్డంకులను ఎదుర్కొని అణగారిన వర్గాలకు న్యాయం కోసం, సమసమాజం స్తాపనకోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అంబేడ్కర్ అని తెలిపారు. భారత దేశం భిన్నత్వం లో ఏకత్వం కల్గిన గొప్ప దేశం. మనదేశంలో అనేక మతాలు అనేక కులాలు, అనేక జాతులు కలిసి మెలిసి సోదర భావం తో స్నేహ భావంతో జీవిస్తున్నాం అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగము. రాజ్యాంగం లో స్పష్టముగా రాసుకున్నమూ విశ్వాసం, ధర్మం, ఆరాదనాలలో స్వాతంత్య్రాన్ని. అంతస్తుల్లో ను , అవకాశాల్లో ను సమానత్వాన్ని ఇచ్చుకోవాలి అని అంబేడ్కర్ భారత రాజ్యాంగం చివరిలో ఒక చక్కటి మాటన్నరు రాజ్యాంగం ఎంత గొప్పదైన దానిని అమలు చేసే స్థానములో మంచివారు ఉంటే ప్రజలకు మంచి ఫలాలు అందుతాయి , అమలు చేసే వారు చెడ్డవారు అయితే చెడు ఫలితాలు ఇస్తుంది అని .అందుకోసమే మంచి పాలకులను ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ ప్రజలకు ఓటు హక్కు అనే చక్కని అవకాశం కల్పించింది. ఓటు ద్వారా మీ పాలకులను మీరే ఎన్నుకోండి అని రాజ్యాంగ తెలుపుతుంది ,మా అల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం కనీస అవగాహన అనే కార్యక్రమాన్ని ప్రతి కళాశాలలో వ్యాస రచన పోటీలు నిర్వహించ బోతున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ మదద్ కంప్యూటర్ సెంటర్ AO రహంతుల్లా, ఫ్యాకల్టీ లు ఆన్సర్ భాష, మజీద్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు