
అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర మీడియా కార్యదర్శిగా జావిద్
అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర మీడియా కార్యదర్శిగా జావిద్
నంద్యాల (పల్లెవేలుగు) 02 ఫెబ్రవరి: ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర మీడియా కార్యదర్శిగా ఆంధ్ర ప్రతిభ చైర్మన్, పల్లె వెలుగు ఎడిటర్, ఏపీయూడబ్ల్యూజే నంద్యాల ఉపాధ్యక్షులు నాజర్ అబ్దుల్ జావిద్ ఎన్నికయ్యారు. కర్నూలు పట్టణం లోని రిసల్దార్ మస్జిద్ నందు సోమవారం సాయంత్రం ఇషా నమాజ్ అనంతరం నిర్వహించిన అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, న్యాయవాది మౌలానా అబ్దుల్ ఖదీర్ నిజామీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జాతీయ కార్యదర్శి హజరత్ శా ఖాద్రి సయ్యద్ ముస్తఫా రిఫాయి జీలని, మౌలానా డాక్టర్ జహీర్ అహ్మద్ రహి ఫిదాయి, మౌలానా అబ్దుల్ గఫూర్ బాఖ్వీ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జాతీయ కార్యదర్శి సయ్యద్ ముస్తఫా రిఫాయి మాట్లాడుతూ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎప్పుడు ప్రార్థించినా ప్రపంచ ప్రజల శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధి కొరకు నిత్యం దువా చేసేవారని ఒక కులానికో మతానికో చెందిన వారి కొరకు కాక సర్వ మతాల వారికి సర్వ కులాల వారికి సర్వజనుల సుఖ సంతోషాల కొరకు ఎలాగైతే ప్రార్థనలను అభివృద్ధి కొరకు ఆకాంక్షించారు. మన ఆలిండియా మిల్లి కౌన్సిల్ కూడా కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సర్వే జనం సుఖినోభవంతు అన్న రీతిన బడుగు బలహీన వర్గాలు ఆపన్నుల కొరకు నిత్యం వారి సమస్యల పరిష్కారానికై ప్రయత్నం చేస్తామని నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులు కూడా కుల మతాలకు వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు. అలాగే మిల్లి కౌన్సిల్ రాష్ట్ర మీడియా విభాగం కార్యదర్శిగా ఎన్నికైన జావిద్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యత అప్పగించారని తన బాధ్యతను వినయ విధేయత చూపిస్తూ బాధ్యత యుతంగా తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తానని తెలియజేశారు