
YSR KADAPA
అమీన్ పీర్ దర్గా ఉరుసును విజయవంతం చేయండి
అమీన్ పీర్ దర్గా ఉరుసును విజయవంతం చేయండి
కడప (పల్లెవేలుగు) 01 డిసెంబర్: మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న కడప అమీన్ పీర్ దర్గా పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి. విజయవంతం చేయాలని దర్గా కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు ఆదేశించారు. గురువారం కడప కలెక్టరేట్లోని బోర్డ్ మీటింగ్ హాల్ నందు అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులు, దర్గా కమిటీ సభ్యులతో కలసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.