
అమరవీరుల త్యాగదనం మరువలేనివి.. వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం
అమరవీరుల త్యాగదనం మరువలేనివి.. వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం
ధర్మవరం (పల్లెవెలుగు) అక్టోబర్ 21: అమరవీరుల త్యాగధనం మరువలేనివని వన్‌టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, టూ టౌన్ సీఐ రాజా, బత్తలపల్లి సీఐ మన్సూరు ఉద్దీన్, ట్రాఫిక్ సిఐ షేక్ వసీదు భాష లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం”పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు”ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటుచేసిన అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించి పోలీసులు యొక్క సేవలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం సిఐలు మాట్లాడుతూ దేశం కోసం రాష్ట్రం కోసం పోలీసులు ప్రాణాలు తెగించి తమ సేవలను కొనసాగిస్తున్నారని, తాము ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేస్తూ న్యాయం కల్పించేందుకే ఉన్నామని తెలిపారు. అమరు వీరులైన పోలీసులను గుర్తు తెచ్చుకుంటూ, వారికి ఘనంగా నివాళులు అర్పించడం మా బాధ్యత అని తెలిపారు. భద్రతకు భరోసా కల్పించేది పోలీసులేనని తెలిపారు. నీతికి న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైన మూడు సింహాలు అయితే, ఆ కనిపించని నాలుగో సింహమే మా పోలీస్ అని తెలిపారు. దేశ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ, మరోపక్క అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం జరుగుతుందన్నారు. నిరంతర ప్రక్రియ దిశలో పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని, ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులు లేనని, ప్రభుత్వాలకు సైతం ముందుగా గుర్తుకు వచ్చేది పోలిసే నని, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో పోలీసులే ముందు ఉంటారని వారు గుర్తు చేశారు. దండేత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేదే పోలీసులలే నని తెలిపారు. ఈ వారోత్సవాలు ఏడు రోజులు పాటు నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పట్టణ మహిళా పోలీసులు, హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.