nandyala

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ ఇషాక్, చైర్మన్ మాబునిసా

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ ఇషాక్, చైర్మన్ మాబునిసా

నంద్యాల (పల్లెవేలుగు) 10 శనివారం: పట్టణం నడిగడ్డ 2వ, 5వ వార్డుల్లో శనివారం ఎమ్మెల్సీ ఇషాక్ భాష, మున్సిపల్ ఛైర్ పర్సన్ మాబున్నిసాలు సుమారు 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మదుకుమార్, కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, సాదిక్, సమ్మద్,  సచివాలయ సిబ్బంది,  వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగడ్డ 2, 5వ వార్డుల్లో రోడ్ల దుస్తితి గురించి ఎమ్మెల్యే శిల్పా రవి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే నూతన రోడ్ల నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలను మంజూరు చేయాలని అధికారులను  ఆదేశించడంతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని రోడ్లను నిర్మించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button