
అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు మృతి
అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు మృతి
ధర్మవరం (పల్లె వెలుగు) 29 నవంబర్: పట్టణంలోని కొత్తపేటలో మంగళవారం తెల్లవారు జామున చింతా శ్రీనివాసులు కుమారుడు చింతా జగదీష్(23) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి తండ్రి కొడుకులు ఇద్దరూ చేదోడు వాదోడుగా ఉంటూ మగ్గమును నేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కరోనా సమయములో కుటుంబ అవసరాల కోసం తదుపరి ముడి పట్టు సరుకుల కోసం 5 లక్షల అప్పులు చేయడం జరిగింది. కానీ నేసిన చీరకు గిట్టుబాటు ధరలు రాక పోవడం తదుపరి ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం మృతునికి మానసిక వేదనను కల్పించింది. కుమారునితో పాటు తల్లిదండ్రులు కూడా చేసిన అప్పు ఎలా తీర్చాలా అని ప్రతిరోజు మనోవేదనకు గురయ్యేవారు. అంతేకాకుండా మృతుడు చింత శ్రీనివాసులకు ఇటీవలే ఆరోగ్యము కూడా సరిగా లేకపోవడం కష్టాలు అధికం కావడంతో ఆర్థిక సమస్యతో సతమత అవుతూ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటన అక్కడి ప్రజలను కలిసి వేసింది. తదుపరి టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను వారు ఆరాధించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.