
అన్ని దానాల్లో కెల్లా అతి ప్రశస్తమైనది అన్నదానం
అన్ని దానాల్లో కెల్లా అతి ప్రశస్తమైనది అన్నదానం
గవర్నర్ పేట విజయవాడ (పల్లెవేలుగు) 10 అక్టోబర్: అన్ని దానాల్లో కెల్లా అతి ప్రశస్తమైనది అన్నదానం అని సి.వి.ఆర్.లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ. ఏ.శరాబంది రావు అన్నారు. ఈ రోజు గవర్నర్ పేటలోని అమృత హస్తం కేంద్రంలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. క్లబ్ సెక్రెటరీ జి.వెంకటేష్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీ నెలా ఏదో ఒక చోట పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి క్లబ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. క్లబ్ మాజీ ప్రెసిడెంట్ ఎమ్.ఎస్.ఇమామ్ బాషా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లు సేవా కార్యక్రమాలలో ముందు ఉంటాయని, అంతర్జాతీయంగా ఎక్కువ మంది సభ్యుల గల సంస్థ అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో ఎల్.సి.ఐ ఎఫ్.కో ఆర్డినేటర్ టి.వెంకట నారాయణ, మార్కెటింగ్ ఛైర్మన్ ఎన్.వి.ఎస్.కృష్ణా రావు, జాయింట్ సెక్రటరీ పి.వి. హనుమంతరావు, ట్రెజరర్ ఎన్.శ్రీనివాస రావు, డైరెక్టర్ లు సి.రూపనాధ్, జి.శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. సుమారు 300 మంది కు అన్నదానం చేసినట్లు ఇమామ్ బాషా తెలిపారు.