Dharmavaram

అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన

అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన

 

ధర్మవరం (పల్లెవెలుగు) 23నవంబర్: పట్టణంలోని శివానగర్లో గల శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన రావడం జరిగిందని ఆలయ అభివృద్ధి కమిటీ పెన్నెం గోపీనాథ్, రెడ్డిపల్లి రామచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులతో పాటు మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తొలుత అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యే దంపతులను స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే పేరిట ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించిన  తర్వాత, ఆలయ విశేషాలను, సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. తదుపరి అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లు వారి చేతులమీదుగా భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం పెనం గోపీనాథ్ రెడ్డిపల్లి రామచంద్రాలు మాట్లాడుతూ పట్టణంలో వెలిసిన ఈ దేవాలయం అతి పురాతనమైనదని ఎంతోమంది భక్తాదుల యొక్క కోరికలను తీరుస్తూ ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టదలిచామని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలతోపాటు ద్రవ్యములచే అభిషేకములు కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి దాదాపు 5,000 మందికి పైగా భక్తాదులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులను పొందడం పట్ల కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గడ్డం రంగా, ఇతర కౌన్సిలర్లు జయరాం రెడ్డి, బ్రహ్మచారి, కాచర్ల అంజి, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర తోపాటు దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button