Dharmavaram

అన్నదానమునకు ఎమ్మెల్యే కేతిరెడ్డి భార్య విరాళం

అన్నదానమునకు ఎమ్మెల్యే కేతిరెడ్డి భార్య విరాళం

ధర్మవరం పల్లె వెలుగు పట్టణములోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరములో డిసెంబర్ 14వ తేదీన నిర్వహించబడు అన్నదాన కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భార్య సుప్రియ తనవంతుగా 20వేల రూపాయల నగదు విరాళాన్ని ఎమ్మెల్యే స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహిమలు, నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, అయ్యప్ప స్వామిని నమ్మిన వారికి అంతా మంచే జరుగుతుందని వారు తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తాదులకు తన వంతుగా అన్నదానం కు తనను భాగస్వామ్యం చేసినందుకు, నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తదుపరి భజన మందిరం కమిటీ వారు సుప్రియ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి విజయ్ కుమార్ తో పాటు శిష్య బృందం పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button