
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ ధర్నా
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ ధర్నా
కోస్గి మండలంలో ఈ నెల కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించిఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ పూజారిశ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ ఖరీఫ్ నందు మండలంలో రైతులు పత్తి ఉల్లి మిరప వేరుశనగ తదితర పంటలు సాగు చేసినారని పంటల సాగుకు ఒక్కో రైతు ఎకరాకు 30000 నుండి 80 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని వారుఅన్నారు అక్టోబర్ నెలలో కురిసిన అధికవర్షాల వల్ల నకిలీ విత్తనాల వల్ల తెగుళ్ల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని దీంతో దిగుబడి రాక రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు ఆందోళన చెందుతున్నారని వారన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయలుపంట నష్టపరిహారం అందించాలని కౌలు రైతులకు పరిహారం అందించాలని అదేవిధంగా ఉల్లి పంటకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు రుణాలు మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కోసి ఆర్ఐ శ్రీరాములకు మరియు ఆర్టికల్చర్ అధికారులు హనుమంతు రంగమ్మ పవిత్రలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాముడు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హనుమంతు నాగేంద్ర రైతులు తాయన్న హనుమంతు చింతకుంట ఈరన్న అంపమ్మ జంపాపురం తాయన్న ఐరన్గల్ వీరేషు బొంపల్లి రామకృష్ణ హనుమంతు నీలకంఠప్ప ఆర్లబండ శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది