
అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం
అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం
కోసిగి అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి పి.తాయన్న. కె.ఉలిగయ్య
రైతుల సమక్షంలో కోసిగి గ్రామ సచివాలయం ముందు జిల్లా కమిటీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ.ఐ.కే.ఎస్. ఆధ్వర్యంలో పిలుపు మేరకు రైతుల సమక్షంలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ. సీపీఐ. కోసిగి మండల కార్యదర్శి సహాయ కార్యదర్శి పి.తాయన్న. కె.ఉలిగయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాలు వచ్చాయి అక్టోబర్ నెలలో 20 రోజులు వరుసగా అధిక వర్షాలు కురిసాయి. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు వచ్చినందున పొలాల్లో పంటలు కుళ్ళిపోయాయి ఉల్లి. పత్తి. వేరుశనగ పంటలు నాశనమయ్యాయి. కూలీలు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ధరలు పెరిగినందున పెట్టుబడి సాగు ఖర్చులు పెరిగాయి . అప్పులు తెచ్చి పంటలు పండించిన చేతికి వచ్చే సమయానికి నష్టం జరిగిపోయింది ఎంత పంటలు నష్టం జరిగినా ఏ అధికారులు కూడా అధికార పార్టీ మంత్రులు ఒక్కరు కూడా పాడైపోయిన పంటలను పరిశీలన చేసి రైతుకు. భరోసా ఇవ్వలేదు కావున తక్షణమే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అలాగే కరెక్ట్ సీజన్ లో బ్యాంకులో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని గ్రామ సచివాలయం అధికారులకు ఇచ్చారు. రైతులు పులుసుతాయన్న. కోసిగి ఆచారి రాందాసు బెళగల్ ఈరన్న జుమ్మలదిన్నె ఈరన్న దుద్ది సిద్దయ్య రైతుల పాల్గొన్నారు