Dewanakonda

అధిక వర్షాల వల్ల, కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి

  • అధిక వర్షాల వల్ల, కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి
  • నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ
  • గ్రామ సచివాలయల దగ్గర సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాలు..

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 07 నవంబర్: ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, నవంబర్ 7వ తారీఖున జిల్లా వ్యాప్తంగా సచివాలయాల ముందు నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా దేవనకొండ, కుంకనూరు, కరివేముల, ప్యాలకుర్తి, నల్లచెలిమల, పి. కోటకొండ, గుండ్లకొండ సచివాలయాల ముందు రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేసిన రైతులకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం  సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి ఎం.నెట్టేకల్ ఆధ్వర్యంలో పార్టీ శాఖల నందు జిల్లా సమితి పిలుపు లో భాగంగా దేవనకొండ మండలంలోని వివిద సచివాలయాల ముందు ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక వర్షాల వలన సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టం జరిగితే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఏమాత్రం నష్టం జరగలేదని రిపోర్టు ఇవ్వడం బాధాకరమైన విషయం అన్నారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు కనిపించలేదన్నారు. రైతులకు జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడంలో కూడా అధికారులు మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. ఉల్లి, మిరప పంటలకు ఎకరాకు 60 వేలు, పత్తి, వేరుశనగ, టమోటా, ఆముదం తదితర పంటలకు ఎకరాకు 40 వేలు పరిహారంగా ఇవ్వాలని, తక్షణమే హంద్రీ పరివాహక ప్రాంతాల నందు పంటలు నీట మునిగి తీవ్ర నష్టం జరిగిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు.

Back to top button