
అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
కోసిగి (పల్లెవేలుగు) 22 అక్టోబర్: అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని,సిపిఐ అనుబంధ సంస్థ అయినా రైతు సంఘం ఆధ్వర్యంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ పంటలు పరిశీలన రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం.గోపాల్ , మండలం సిపిఐ పార్టీ కార్యదర్శి , సహాయ కార్యదర్శి తాయన్న , ఉలిగయ్య ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య , రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం , సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పంప్పన్న గౌడ్ లు మాట్లాడుతూ గత 20 రోజులు నుంచి ఎడతెరవలేకుండా భారీ వర్షాలు కురవడంతో ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని , జూన్ నుంచి జూలై నెలలో కురిసిన వర్షాలకు పంటలు బాగా ఉన్నప్పటికి గత 20 రోజుల నుంచి ఎడతెరవక లేకుండా భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు చాలా నష్టపోయి , రైతులు ఖరీఫ్ సీజన్లో బ్యాంకులు తీసుకున్న క్రాప్ రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేయాలన్నారు. అలాగే ఈ వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు పంట బీమా , నష్టపరిహారం ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. అలాగే మిరప పంట ఎకరాకు పెట్టుబడి ఒక లక్ష రూపాయలు , ఉల్లికి యాబై వేలు , పెట్టుబడి పెట్టి రైతుల పూర్తిగా నష్టపోయారన్నారు.పత్తికి ఎకరాకు నలబైవేలు, వేరుశనగకు మూప్పై వేలు ,పెట్టుబడి పెట్టి రైతుల నష్టపోవడంతో , వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పంటలకు బీమా మరియు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు డీకే, సిద్ధప్ప, ఈరన్న, రాజు, ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు ఎస్.ఈరేష్ మండల సహాయ కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.