Dewanakonda

అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని

  • అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని
  • సీపీఐ రైతుసంఘం ఆధ్వర్యంలో దేవనకొండ, వెలమకూరుసచివాలయాల ఎదుట  ధర్నా
  • తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి.
  • ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్.

దేవనకొండ (ఆంధ్రప్రతిభ) 07 నవంబర్: సీపీఐ రైతుసంఘం జిల్లా సమితి పిలుపు మేరకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని  దేవనకొండ, వెలమకూరు   గ్రామ సచివాలయాల  ఎదుట సీపీఐ రైతుసంఘం ఆధ్వర్యంలో  ఆందోళన కార్యక్రమం రైతుసంఘం మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్,సీపీఐ మండల సహాయకార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి లు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ నందు సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు వచ్చి పంట పొలాలు కుళ్ళిపోయాయి. ఉల్లి, మిరప, పత్తి, ఆముదం, వేరుశనగ, టమోటా పంటలు నాశనం అయ్యాయి.కూలీలు విత్తనాలు,ట్రాక్టర్లు బాడుగలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు ధరలు పెరిగినందున సాగు ఖర్చులు పెరిగాయి. ఒక ఎకరానికి 40 వేలు రూపాయలు నుండి 1 లక్ష రూపాయల వరకు  బ్యాంకు ల లో ప్రయివేటు వారి దగ్గర వడ్డీలుకు తెచ్చి వ్యవసాయం చేశారు. మరికొన్ని చోట్ల నకిలీ విత్తనాలు వల్ల నష్టపోయారు. ఇంత వర్షాలు వచ్చి పంటలు కుళ్ళిపోయినందున పెట్టిన పెట్టుబడులు 10 శాతము కూడా దిగుబడి రాలేదు.వ్యవసాయ అధికారులు, రైతుబరోసా అధికారులు, యం. ఆర్.ఓ లు ,అధికార పార్టీ మంత్రులు ,యం.ఎల్.ఏ లు ఒక్కరు కూడా పాడై పోయిన పంటలు ను పరిశీలన చేయలేదు.రైతుకు భరోసా ఇవ్వలేదు.జిల్లా అధికారులు పంట నష్టం ఎంత జరిగింది అని అంచనా వేయలేదు. తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Back to top button